స‌మంత లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త వ్య‌క్తి..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు స‌మంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న స‌మంత గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆమె వైవాహిక జీవితంపై అనేక రూమ‌ర్లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాడు.

స‌మంత‌, చైతు బంధానికి బీటలు వాలినట్లు.. వీరిద్ద‌రూ విడాకులకు అప్లై చేసిన‌ట్లు వార్త‌లు తెగ వైర‌ల్ అవుతున్నారు. కానీ, స‌మంత మాత్రం వాటిని ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా గోవా వెకేషన్ కి వెళ్లి మస్తు ఎంజాయ్ చేసింది. ఇక అక్క‌డ నుంచి వ‌చ్చిన త‌ర్వాత వ‌రుస ఫొటో షూట్ల‌లో పాల్గొంటూ ర‌చ్చ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ త‌న లైఫ్‌లోకి ఓ కొత్త వ్య‌క్తిని వెల్క‌మ్ చెప్పింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

కుక్క పిల్లలు అంటే ఎంత‌గానో ఇష్ట‌ప‌డే సమంతకు హాష్‌ అనే అంద‌మైన బుజ్జి కుక్క ఉన్న సంగ‌తి తెలిసిందే. ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా హాష్‌తో ఫుల్ ఎంజాయ్ చేసే స‌మంత‌.. తాజాగా మ‌రో కుక్క‌ను ఇంటికి తీసుకొచ్చుకుంది. దానికి సాషా అని నామ‌క‌ర‌ణం కూడా చేసింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిన స‌మంత‌.. సాషా అస్స‌లు కుదురుగా ఉండ‌టం లేద‌ని, త‌న‌ను ఒక క‌ప్పు కాఫీని కూడా ప్ర‌శాంత‌గా తాగ‌నీయడం లేద‌ని స‌ర‌దాగా చెప్పుకొచ్చింది. అంతేకాదు, సాషా ఫొటోల‌ను కూడా షేర్ చేసింది. దాంతో ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest