సాయిధరమ్ తేజ్‌పై రెండు కేసులు న‌మోదు చేసిన పోలీసులు!

September 11, 2021 at 11:40 am

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆపోలో హాస్ప‌ట‌ల్‌లో తేజ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కాలర్‌ బోన్‌ విరిగిందని అపోలో ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు.

Sai Dharam Tej Accident: Chiru, Pawan And Allu Aravind At Apollo -

అయితే మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై రాయ‌దుర్గం పోలీసులు కేసు న‌మోదు చేశారు. నిర్ల‌క్ష పూరిత‌మైన‌, వేగ‌వంత‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు ప్రాధ‌మిక నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. దాంతో సాయిధ‌ర‌మ్ పై ఐపీసీ సెక్ష‌న్ 336, మోట‌ర్ వెహికిల్ యాక్ట్ 184 కింద రెండు కేసులు న‌మోదు చేశారు.

Rayadurg police register case against Sayidharam Tej » Jsnewstimes

రాత్రి 8:05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

సాయిధరమ్ తేజ్‌పై రెండు కేసులు న‌మోదు చేసిన పోలీసులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts