సీటీ మార్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా..?

September 11, 2021 at 12:42 pm

దాదాపు కొన్ని సంవత్సరాల పాటు విజయానికి నోచుకోని గోపీచంద్ ఇటీవల సీటీ మార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటి షో తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్లను రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..

ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 600 థియేటర్లలో విడుదల చేశారు. ఇక మార్నింగ్ షో కే ఈ సినిమా మంచి టాక్ తో హౌస్ ఫుల్ బోర్డులతో అదరగొట్టింది. ఇక ఇదే జోరు ఆ రోజంతా కొనసాగించడం జరిగింది ఈ సినిమా. అందుచేతనే మొదటి రోజే ఎన్నో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది ఈ సినిమా. సీటీ మార్ మూవీ రూ.1.8 కోట్ల రేంజిలో ఓపెనింగ్ బిజినెస్ ను రాబట్టింది. ఇక మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర మొత్తం కలెక్షన్లను చూస్తే..3 నుండి 3.3 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లను రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో విడుదల అయినది కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి తమన్నా తన సొంత వాయిస్ తోనే డబ్బింగ్ చెప్పి అదరగొట్టింది. ఈ సినిమాలో ముఖ్యంగా జ్వాలా రెడ్డి పాటకు మంచి స్పందన రావడం విశేషం. ఇక ఈ సినిమాలో మరొక బ్యూటీ దిగంగన సూర్యవంశీ కూడా బాగా నటించింది అని చెప్పవచ్చు.

సీటీ మార్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్ని కోట్లా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts