మ‌రో మల్టీస్టారర్‌కు రానా గ్రీన్‌సిగ్నెల్‌..ఈసారి ఏ హీరోతో అంటే?

ఆ మ‌ధ్య మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు భారీగా పెరిగి పోతున్నాయి. స్టార్ హీరోలు సైతం మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేయ‌డానికి ఏ మాత్రం వెన‌క‌డుగు వేయడం లేదు. ఈ లిస్ట్‌లో రానా ద‌గ్గుబాటి ఒక‌రు. ఇప్ప‌టికే ఈయ‌న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో `బీమ్లా నాయ‌క్‌` అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రం చేస్తున్నారు. అలాగే బాబాయ్ వెంకేట‌ష్‌తో క‌లిసి `రానా నాయుడు` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.

- Advertisement -

Happy Birthday Sharwanand: 5 films that prove he's one of the finest actors  of his generation | The Times of India

ఇక తాజాగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి రానా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇందులో రానా ఒక హీరోగా కాగా.. టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ యాక్ట‌ర్ శ‌ర్వానంద్ మ‌రో హీరోగా న‌టించ‌బోతున్నాడు.

Mythri Movie Makers locks Tamil Superstar for their next | Manacinema

స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేస్తూ, మైత్రీ కళ్లలో పడిన ఒక యువకుడు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హింబోతున్నాడ‌ట‌. అంతేకాదు, ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని.. అటు రానా, ఇటు శ‌ర్వా ఇద్ద‌రూ సినిమా చేసేందుకు ఓకే చెప్పార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ గుస‌గుస‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Share post:

Popular