భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్త్‌డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డులను బద్దలు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు సోసల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మోదీకి బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ స్పెసల్‌గా బర్త్‌డే విషెస్ తెలియజేశారు. `శ్రీ మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!! మన భారత దేశానికి ధృడ చిత్తం కలిగిన నాయకుడు అవసరమని నేను నిత్యం పరితపించేవాడిని. ఆ నాయకుడు మన విశాల భారత సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన రాజనీతిజ్ఞుడై ఉండాలని కోరుకునేవాణ్ణి.
ముఖ్యంగా భిన్న మతాలు,భిన్న జాతులు,భిన్న సంస్కృతులు,భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన ఒక బిలియన్ ప్రజల భూమిని పాలించడం అంటే.. కత్తి మీద సాము వంటిదే.ఆ స్థానంలో ఉండటం ఎంతటివారికైనా సవాళ్లతో కూడుకున్నదే.అటువంటి స్థానంలో నిలిచిన శ్రీ నరేంద్ర మోదీ గారు..గొప్ప దార్శనికునిగా నేను భావిస్తాను. ఇక 2014 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా శ్రీ మోదీ గారితో కలసి అనేక సభలలో ప్రచారంలో చేసే అవకాశం నాకు లభించింది. ఆయనలోని ఆకర్షణ శక్తిని సునిశితంగా గమనించడానికి ఆ ప్రయాణం నాకు దోహదపడింది.` అంటూ పవన్ వరుస ట్వీట్లు చేశాడు.
In 2014 elections, i was able to travel closely & could keenly observe Hon. PM Sri @narendramodi ji’s charismatic nature & dynamic leadership skills.
His commitment, dedication and selfless service towards the country truly inspires us all.🙏 pic.twitter.com/nZAciI3mRw
— Pawan Kalyan (@PawanKalyan) September 16, 2021