`టక్ జగదీష్` ఫ్లాప్ అయినా హ్యాపీగా ఉన్న నాని..ఎందుకో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది.

- Advertisement -

Tuck Jagadish On Amazon Prime Video, Nani, Direct Ott Release, Tuck Jagadish  Trailer - YouTube

ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న కొడుకైన హీరో వాటిని ఎలా పరిష్కరించాడన్న కథతో ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అంతే. డైరెక్ట‌ర్ శివ నిర్వాణ పాత క‌థనే కొత్త‌గా చూపించాల‌నుకున్నాడు. కానీ, పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేదు. ఇక అన్నీ తానై నాని సినిమాను న‌డిపించిన‌ప్ప‌టికీ.. ట‌క్ జ‌గ‌దీష్ చివ‌ర‌కు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది.

Inside Story: All about Tuck Jagadish digital Deal?

అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా నాని ఓ విష‌యంలో మాత్రం హ్యాపీగా ఉన్నాడ‌ట‌. ఇంత‌కీ నానిని సంతోష పెట్టిన ఆ విష‌యం ఏంట‌నేగా మీ సందేహం.. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన అన్ని తెలుగు సినిమాల్లో..తొలిరోజే అత్యధిక మంది వీక్షించిన సినిమాగా `టక్ జగదీష్` ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచి సూప‌ర్ రికార్డును సొంతం చేసుకుంద‌ట‌. అందు వ‌ల్ల‌నే నాని ఎంతో హ్యాపీగా ఉన్నార‌ట‌.

Share post:

Popular