ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివరించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు వారికి జగన్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబర్ 4న సినీ పెద్దలు జగన్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జరగనున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి మీటింగ్స్‌లో చిరు పాటు ఖచ్చితంగా కింగ్ నాగార్జున ఉంటారు. కానీ, ఈ సారి జగన్‌తో జరగబోయే మీటింగ్ నుంచి ఆయన సైడైనట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ 5 తెలుగుకి హోస్టింగ్ చేస్తున్నారు. ఆ షో ఆదివారం నుంచి స్టార్ మాలో ప్రసారం కానుంది. అంటే షూటింగ్ మొత్తం నాలుగో తేదీనే పూర్తి అవ్వాల్సి ఉంటుంది. అంటే నాలుగో తేదీ మొత్తం బిగ్‌బాస్ షూటింగ్‌తో నాగ్ ఫుల్ బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే సీఎంతో జరగబోయే మీటింగ్‌కు ఆయన రావడం కష్టమే అని వార్తలు వస్తున్నాయి. దీంతో చిరుతో పాటు వెళ్లే ఇతర హీరోలు ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.