రిలీజ్ రోజే సూప‌ర్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న `ల‌వ్ స్టోరీ`!

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ రోజు థియేట‌ర్స్‌లో విడుద‌ల అయింది.

Naga Chaitanya-Sai Pallavi's Love Story gets release date | Entertainment  News,The Indian Express

అయితే రిలీజ్ రోజే ఈ చిత్రం ఓ సూప‌ర్ రికార్డ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల విడుద‌లైన ఈ మూవీ సాంగ్ `సారంగ దరియా` ఇప్ప‌టికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేయగా, నేడు 325 మిలియన్ వ్యూస్ మార్క్‌ని బ్రేక్ చేసి మరో ఫాస్టెస్ట్ రికార్డు సాధించింది.

Sai Pallavi's Saranga Dariya sets new record on YouTube- Cinema express

దాంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ అయిపోతోంది. మ‌రోవైపు ల‌వ్ స్టోరీ చూసిన ప్రేక్ష‌కుల‌ను త‌మ‌దైన శైలిలో రివ్యూలో ఇస్తూ సోష‌ల్ మీడియాను హీటెక్కించేస్తున్నారు. అయితే చాలా వ‌ర‌కు పాజిటివ్ రివ్యూలే వ‌స్తుండ‌డంతో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని మేక‌ర్స్ థీమా వ్య‌క్తం చేస్తున్నారు.

Share post:

Latest