వెనక్కి వెళ్తున్న కొండపొలం.. అయ్యగారి కోసమే!

September 23, 2021 at 12:44 pm

టాలీవుడ్‌లో ఉప్పెన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, తన తొలి చిత్రంతోనే అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేశాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో ‘కొండపొలం’ అనే పూర్తి అడవినేపథ్యంలో సాగే కథను ఈ సినిమా ద్వారా మనముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

కాగా అతి తక్కువ సమయంలో చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అక్టోబర్ 8గా చిత్ర యూనిట్ అనౌన్స్ కూడా చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను దసరా బరిలో నుండి తప్పిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు చాలా కాలం తరువాత థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతుండటంతో, మరో చిత్రం నష్టపోకుండా ఉండేలా చిత్ర దర్శకనిర్మాతలు వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. కాగా దసరా బరిలో అక్కినేని అఖిల్ నిటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. దీంతో ఈ సినిమాకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకే తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు కొండపొలం చిత్ర యూనిట్ చెబుతోంది.

అఖిల్ తన కెరీర్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నా, అనుకున్న స్థాయిలో బ్లాక్‌బస్టర్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. దీంతో ఈసారి అఖిల్ ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని కొండపొలం చిత్ర యూనిట్ కూడా కోరుకుంటోంది. అందుకే తమ సినిమాను దసరా బరిలో నుండి తప్పించి అఖిల్ చిత్రానికి పోటీ తప్పించాలని చూస్తుంది. మరి కొండపొలం ప్లాన్ అయ్యగారికి ఎంతవరకు వర్కువట్ అవుతుందో తెలియాలంటే మాత్రం అక్టోబర్ 8 వరకు ఆగాల్సిందే.

వెనక్కి వెళ్తున్న కొండపొలం.. అయ్యగారి కోసమే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts