ఆక‌ట్టుకుంటున్న `ఇదే మా కథ` ట్రైల‌ర్‌..!

శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఇదే మా క‌థ‌`. గురు పవన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా నిర్మించారు.

Idhe Maa Katha (2021) - IMDb

ఈ మూవీ గాంధీ జ‌యంతి కానుక‌గా అక్టోబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై, ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? ఈ జ‌ర్నీలో వారికి ఎదురైన స‌వాళ్లు ఏంటీ? అనే ఆస‌క్తిక‌ర‌ క‌థాంశంతో ఈ మూవీ ఉండ‌బోతోంద‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

Watch Idhe Maa Katha on ott streaming online

బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్‌, విజుల్స్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను `ఇదే మా క‌థ` అందుకుంటుందో లేదో తెలియాలంటే అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. కాగా, టాలీవుడ్‌లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న చిత్ర‌మిది. ఈ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

Share post:

Latest