సాయి ప‌ల్ల‌విని ఏకిపారేసిన చిరంజీవి.. కార‌ణం అదేన‌ట‌?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన సాయి ప‌ల్ల‌విని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అంద‌రి ముందు ఏకేశారు. ఇందుకు కార‌ణం ఆయ‌న సినిమాను రిజెక్ట్ చేయ‌డ‌మే. మెహ‌ర్ రామేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది.

Telugu7.com:Sai Pallavi Rejected Megastar Movie-'పాన్ ఇండియా' ఫేమ్ కోసమే  'మెగాస్టార్'కి నో చెప్పిందా..??

కానీ, మొద‌టి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా.. ఆమె రిజెక్ట్ చేసింద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ ప్ర‌చారం నిజ‌మే అంటూ `ల‌వ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓపెన్ అయ్యారు చిరు. ఆయ‌న మాట్లాడుతూ.. సాయి పల్లవి భోళా శంకర్ సినిమాలో తన చెల్లెలిగా నటించాలని అడిగితే.. అందుకు ఆమె నో చెప్పింది. నా మూవీని రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటూ వెట‌కారంగా సాయి ప‌ల్ల‌వికి చుర‌క‌లు అంటించారు.

Love Story Unplugged Event Highlights

దాంతో సాయి ప‌ల్ల‌వి అందుకుని.. `మీరు అలా చెప్పకండి సార్. నేను సినిమాను చేయను అని చెప్పలేదు. నాకు రీమేక్ అంటే చాలా భయం. అందుకే నో చెప్పాను` అంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత మళ్లీ చిరంజీవి అందుకుంటూ.. సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు.

Share post:

Latest