తూర్పుగోదావరి జిల్లాలో చిరు-ప‌వ‌న్‌ల ప‌ర్య‌ట‌న‌..కార‌ణం అదే!

రీల్ లైఫ్‌లో స్టార్ హీరోలు, రియ‌ల్ లైఫ్‌లో అన్న‌ద‌మ్ములైన మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్‌ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించ‌బోతున్నారు.

Chiranjeevi birthday: 12 of his best songs that made him 'King of Dance' |  Entertainment News,The Indian Express

ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావ‌రి జిల్లా వెళ్ల‌బోతుండ‌గా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మ‌రోవైపు అక్టోబర్ 2న అంటే శ‌నివారం ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజమండ్రిలో ప‌ర్య‌టించ‌బోతున్నారు. రోడ్ల శ్రమధానంలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజ్‌కు ప‌వ‌న్ రానున్నారు.

Telugu film body distances itself as Pawan Kalyan's comments kick up  furore: 'Not the voices of industry as a whole' | Entertainment News,The  Indian Express

రోడ్ల దుస్థితి పరిశీలించి శ్రమదానం చేయనున్నారు పవన్‌కళ్యాణ్. ఇందు కోసం జ‌న‌సేన నాయ‌కులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి తూర్పుగోదావ‌రి జిల్లాలో అక్టోబ‌ర్ 1, 2 తేదీల్లో మెగా బ్ర‌ద‌ర్స్ సంద‌డి నెల‌కోనుంది.

Share post:

Latest