ఏకంగా 5 అవార్డులు కొట్టేసిన `అల..` టీమ్‌..ఫుల్ హ్యాపీలో బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌..వైకుంఠ‌పురములో`. 2020 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఎన్నో అరుదైన రికార్డుల‌ను సైతం నెల‌కొల్పింది.

Ala Vaikunthapurramuloo Upper hand! RRR team to counter star attraction of  Sarileru Neekevvaru

అయితే ఇప్పుడు ఈ చిత్రం ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ ఫంక్ష‌న్‌లో టాలీవుడ్ టాప్ సెల‌బ్రెటీలంద‌రూ సంద‌డి చేశారు. అయితే ఈ అవార్డ్ ఫంక్ష‌న్‌లో అల‌.. టీమ్ ఐదు అవార్డుల‌ను కొట్టేసింది.

Image

ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ మ్యూజిక్స్ డైరెక్టర్ అవార్డ్స్ అల వైకుంఠపురంలో చిత్రానికి దక్కాయి. ఐదు ప్రధాన విభాగాల్లో అవార్డ్స్ దక్కడంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు. మ‌రోవైపు ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన బ‌న్నీ.. ఫుల్ హ్యాపీగా ఉన్న‌ట్టు చెప్పుకొచ్చు.

Share post:

Latest