అందుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సమంత.. పేరు మారుస్తుందా?

September 28, 2021 at 8:51 pm

టాలీవుడ్ బ్యూటీ సమంత హీరో నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా ఈ బ్యూటీ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు పలు రంగాల్లో తన సత్తాను చాటుతోంది. ఈ నేపథ్యంలోనే తన కలల ప్రపంచం అంటూ సాకీ ఈ పేరుతో ఆన్లైన్ వస్త్ర వ్యాపారం ను షురూ చేసింది. ఇందులో స అంటే సమంత కీ అంటే అక్కినేని అని అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి.

మరి అది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ వ్యాపారం చూడు చేసి నేటికి సంవత్సరం పూర్తి అయ్యింది.ఈ సందర్భంగా ఈ సాకి కలల ప్రపంచానికి సంబంధించి ఒక వీడియోనీ షేర్ చేసింది. అంతేకాకుండా గత ఏడాది ప్రేమను కురిపించిన ప్రతి కుటుంబానికి కృతజ్ఞతలు.. ఈ అసాధారణమైన ప్రయాణానికి ధన్యవాదాలు అని ట్యాగ్ లైన్ రాసింది.

ఇక ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య ల విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సందర్భంగా సమంతా తన పేరును మార్చుకుంటుందా. ఈ విషయాలపై పూర్తి క్లారిటీ ఇంకా తెలియాల్సి ఉంది.

అందుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సమంత.. పేరు మారుస్తుందా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts