ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌..ఏంటి క‌థా?

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ పూరి జగన్నాధ్- క్రిష్- జ‌యం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు.

Charmme decides to stay away from social media | TeluguBulletin.com

తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ ద‌ర్శ‌కులు ఏం చ‌ర్చించుకుంటున్నారో ఊహించ‌గ‌ల‌రా? అంటూ ప్ర‌శ్నించింది కూడా.

Image

దాంతో పూరి లైగర్.. క్రిష్ హరి హర వీర మల్లు .. జయం మోహన్ రాజా గాడ్ ఫాదర్ చిత్రాల గురించి చర్చలు జరిగాయని కొంద‌రు గెస్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు ఆ న‌లుగురు ద‌ర్శ‌కులు క‌లిసి ఏదైనా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారేమో అని అంటున్నారు. కానీ, అస‌లు మాట‌ర్ ఛార్మీకే తెలుసు. మ‌రి ఆమె ఏమైనా గుట్టు విప్పితేగానీ.. ఈ న‌లుగురు ద‌ర్శ‌కుల భేటీ వెన‌కున్న క‌థ బ‌య‌ట‌కు రాదు.

Share post:

Latest