క‌న్నీరు పెట్టుకున్న శ్రీముఖి.. ఎందుకంటే..?

తెలంగాణలో నిజామాబాద్‌కు చెందిన యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చాలా రోజుల నుంచి సందడి చేస్తోంది. హుషారైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జులాయి’ ఫిల్మ్‌తో టాలీవుడ్ వెండితెరపైన సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా కనిపించింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన శ్రీముఖి, పలు కార్యక్రమాలకు యాంకర్‌గాను వ్యవహరిస్తున్నది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లోనూ అలరిస్తుంటుంది శ్రీముఖి. కాగా, చాలా రోజుల తర్వాత ఈ భామ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పైన కనిపించనున్నది.

సత్తిబాబు డైరెక్షన్‌లో వస్తున్న ‘క్రేజీ అంకుల్స్’సినిమాలో శ్రీముఖి ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం ఈ నెల 19న విడుద‌ల కానుంది. కాగా, సినిమా ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉంది శ్రీముఖి. ఈ క్రమంలోనే మీడియాతో ముచ్చటించింది శ్రీముఖి. కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి చాలా కష్టపడినట్లు పేర్కొంది. ఇకపోతే షోస్ షూటింగ్ చేసే సమయంలో చాలాసేపు నిల్చుని ఉండాల్సి వచ్చేదని, కొన్ని షోలలో అయితే అంతసేపు నిలబడటం వల్ల కాళ్లు తిమ్మిర్లు వచ్చేసేవని తెలిపింది. షూటింగ్ కోసం ఉద‌యం 7 గంటలకు వెళ్తే తర్వాతి రోజు ఉద‌యం 7 గంటలకు తిరిగి ఇంటికి వెళ్లిన సందర్భాలున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో అసలు ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చానా? అని బాధపడి ఏడ్చిన‌ సందర్భాలున్నాయని పేర్కొంది. అయితే నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతో వాటన్నింటినీ అధిగమించానని చెప్పుకొచ్చింది శ్రీముఖి.