ఆదివారం నాడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు మరియు రక్షాబంధన్. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఇంట ఆయన పుట్టినరోజు వేడుకలు, రక్షాబంధన్ వేడుకల అట్టహాసంగా జరిగాయి. మెగా బ్రదర్స్, సిస్టర్స్, హీరోలు, పిల్లలు ఇలా అంతా ఒక్కచోట చేరి సందడి చేశారు. అయితే ఈ మెగా వేడుకల్లో అల్లు అర్జున్ మరియు ఆయన సతీమణి స్నేహారెడ్డి పాల్గొనలేదు.
దాంతో అల్లు అర్జున్ దంపతులు ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇలాంటి తరుణంలో సంచలన దర్శకుడు, వివాదాలకే కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ మెగా ఫ్యాన్స్‌కు మంటపుట్టేలా ట్వీట్స్ చేశారు. తన ట్వీట్స్‌లో అల్లు అర్జున్‌కు ఆకాశానికి ఎత్తేస్తూ, మిగిలిన మెగా హీరోలందరినీ కించపరిచాడు వర్మ.
మెగా ఫ్యామిలీలో వారసులందరితో పోల్చితే నటుడు అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ ఒక్కడే రియల్ మెగా సక్సెస్ అందుకున్నాడని, అతనే అసలైన సెల్ఫ్ మేడ్ స్టార్ అని పేర్కొన్న వర్మ.. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా మిగిలిన మెగా హీరోలందరూ చిరంజీవి అండదండలతోనే ఎదుగుతున్నారని విమర్శలు గుప్పించాడు. ఇక మెగా వేడుకలకు అటెండ్ కాకపోవడం అనేది బన్నీ తెలివితేటలకు నిదర్శనం అని వర్మ చెప్పుకొచ్చాడు. దాంతో ఇప్పుడు వర్మ చేసిన ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. మెగా ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు.
Real true Success is the Mega Success of a comedian Allu Ramalingiaah’s grandson @alluarjun against the sons ,nephews,nieces, uncles etc etc relatives of @KChiruTweets
— Ram Gopal Varma (@RGVzoomin) August 23, 2021
The intelligence of @alluarjun is in not to attend @KChiruTweets celebrations is becos he is a self made star and shouldn’t join family parasites like @IAmVarunTej @IamSaiDharamTej @PawanKalyan @AlwaysRamCharan etc etc who just exist by sucking the success of MEGA @KChiruTweets
— Ram Gopal Varma (@RGVzoomin) August 23, 2021