తండ్రితో మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను పంచుకున్న చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్!

అగ్ర న‌టుడు, తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు నేడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరుకు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

Megastar Chiranjeevi, Ram Charan to interact with their fans - English

తాజాగా ఆయన త‌న‌యుడు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య షూటింగ్ స‌మ‌యంలో తండ్రితో గ‌డిపిన కొన్ని మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను ఓ వీడియో రూపంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా అంద‌రితోనూ పంచుకున్నాడు. ఈ వీడియోకు `జీవితంలో మరువలేని క్షణాలు ఇవి` అని రామ్ చరణ్ రాసుకొచ్చారు.

On Chiranjeevi's 42nd Wedding Anniversary, His Son, Ram Charan Shares  Priceless Photo Of His Parents

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ముఖ్యంగా మెగా అభిమానుల‌ను ఈ వీడియో తెగ ఆక‌ట్టుకుంటోంది. కాగా, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్ర‌మే ఆచార్య‌. ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

Share post:

Latest