నాన్న లేక‌పోతే ప‌వ‌న్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తాజాగా రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. చ‌ర‌ణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అస‌లేం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న‌టి నుంచీ ప్రారంభ‌మైంది.

Gangadhar.J (@GangadharJ4) | Twitter

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డంలో అటు మెగా, ఇటు నంద‌మూరి అభిమానుల‌కు క‌నుల పండ‌గ‌గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ షోలో చ‌ర‌ణ్ ఎన్నో విష‌యాలు షేర్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాబాయ్ పవన్ కళ్యాణ్‌పై చెర్రీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

A multi-starrer with Pawan Kalyan and Ram Charan on the cards? | Telugu Movie News - Times of India

చరణ్ మ‌ట్లాడుతూ.. `నాన్నగారు షూటింగ్స్ తో బిజిగా ఉండేవారు. అయితే ఆయ‌న లేన‌ప్పుడు బాబాయే తనని తండ్రిలా చూసుకున్నారు. త‌న‌కు ఏది కావాల‌న్నా స‌మ‌కూర్చేవారు. తమది మాటల్లో చెప్పలేని బంధం. నాన్నగారు నాతో చెప్పలేని విషయాలని బాబాయ్ చెప్పేవారు` అని ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చాడు.