ప్ర‌భాస్ బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ మూవీ..లైన్‌లో ముగ్గురు ద‌ర్శ‌కులు?!

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఆ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

- Advertisement -

త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోనుంది. అయితే శంక‌ర్ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్.. ప్ర‌భాస్ హోమ్ బ్యాన‌ర్ అయిన యూవీ క్రియేషన్స్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

నిజానికి యూవీ క్రియేష‌న్స్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఇద్దరూ రామ్ చరణ్ కు మంచి స్నేహితులు. ఆ స‌న్నిహిత్యంతోనే వారి బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ మూవీ చేసేందుకు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది మాత్రం సస్పెన్స్. అయితే ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి, గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుముల ఈ ముగ్గురూ చ‌ర‌ణ్‌ను డైరెక్ట్ చేయ‌డానికి లైన్‌లో ఉన్న‌ట్టు టాక్‌.

Share post:

Popular