బ్లాక్ బాస్టర్ మూవీని వదులుకున్న మీనా . కారణం..

మీనా.. తెలుగులో సీతారత్నం గారి అమ్మాయి అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. కాకపోతే ఈమె 1982వ సంవత్సరంలో మొట్టమొదటి సారిగా తమిళ చిత్రం “నెంజంగల్” అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా తమిళ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా తన చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా, ఆ తర్వాత వివిధ భాషా చిత్రాలలో నటించి, తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో సీతారత్నం గారి అమ్మాయి సినిమాతోనే మొదటి సక్సెస్ ను అందుకున్న, ఆ తర్వాత వెంకటేష్, చిరంజీవి, రాజశేఖర్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన దాదాపు 30 సంవత్సరాల పాటు నటించి, సూపర్ స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

తెలుగు ,తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ చిత్రాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె, కాల్ షీట్ కు డేట్స్ కావాలంటే మాత్రం తప్పకుండా మీనా వాళ్ళ అమ్మగారిని అడగాల్సిందే నట. వాళ్ళ అమ్మ పెట్టిన ఎన్నో రిస్ట్రిక్షన్ ల మధ్య సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మీనా, వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకునేదట. ఇక అంతే కాదు తను ఏ సినిమాలో నటించాలి..? ఎవరికి ఏ సినిమా డేట్స్ ఇవ్వాలి..? అనేది కూడా మీనా వాళ్ళ అమ్మ నిర్ణయించేవారట.ఇక వాళ్ళమ్మ కారణంగా బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ను వదులుకున్నానని చెప్పింది మీనా..

ఆ సినిమా ఏమిటంటే..? నాగార్జున సినీ కెరియర్ ను మార్చేసిన “నిన్నే పెళ్ళాడుతా” సినిమా లో మొదటగా టబు పాత్రలో హీరోయిన్ గా మీనాని అనుకున్నారు .కాకపోతే వాళ్ళమ్మ కేవలం 20 రోజులు మాత్రమే కాల్ షీట్ ఇస్తానని , కుదిరితే హీరోయిన్ గా పెట్టుకోమని గట్టిగా చెప్పేసిందట..” ఒక హీరోయిన్ అంటే 20 రోజులు పెడితే సరిపోదు కదా..! హీరోయిన్ రోల్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది.. అలాంటప్పుడు ఎక్కువ సమయం షూటింగ్లోనే గడపాల్సి ఉంటుంది.. ఇక అందుకే వారు మీనా ను తీసుకోలేదు. అలా వాళ్లమ్మ కారణంగా బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ను వదులుకుంది మీనా. ఇప్పటికీ వాళ్ళమ్మ కారణంగా బ్లాక్ బాస్టర్ సినిమాలో ఛాన్స్ మిస్ అయ్యానని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుందట.