చిరుతో ప్ర‌కాశ్ రాజ్ స‌డెన్ మీటింగ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌.. ఈ మ‌ధ్య ధ‌నుష్ మూవీ షూటింగ్‌లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ప్ర‌కాశ్ రాజ్‌.. స‌ర్జ‌రీ చేయించుకుని నిన్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు.

అయితే ఈ రోజు ఉద‌యం ప్ర‌కాశ్ రాజ్‌ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వ‌యంగా ప్రకాష్‌ రాజ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ మేర‌కు `బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం ఆనందంగా ఉంది. మీరు ఎప్పుడూ మాకు స్ఫూర్తిదాయకం అన్నయ్య` అంటూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఈయ‌న ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

కాగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌కాశ్ రాజ్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఆయన తన ప్యానెల్‌ని ప్రకటించి ప్రెస్‌మీట్‌ కూడా పెట్టారు. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లూ జ‌ర‌గ‌బోతున్నాయి. ఇలాంటి త‌రుణంలో చిరును ప్ర‌కాశ్ రాజ్ క‌ల‌వ‌డంతో.. వీరి స‌డెన్ మీటింగ్‌ ఇండ‌స్ట్రీలో ర‌కర‌కాల చ‌ర్చలకు దారి తీస్తోంది.

https://twitter.com/prakashraaj/status/1427486278711320580?s=20