`శ్రీదేవి సోడా సెంటర్`పై మ‌హేష్ రివ్యూ..ఇంత‌కీ ఏం చెప్పాడంటే?

August 28, 2021 at 1:18 pm

సుధీర్ బాబు, ఆనంది జంట‌గా న‌టించిన తాజా చిత్రం `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌`. ప‌లాస 1978 డైరెక్టర్‌ కరుణకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము శుక్ర‌వారం విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుందీ చిత్రం.

Sudheer Babu's 'Sridevi Soda Center' release date announced | Telugu Movie  News - Times of India

అయితే తాజాగా ఈ సినిమాను తన ఇంట్లోని మినీ థియేటర్లో వీక్షించిన సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. త‌న‌దైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `శ్రీదేవిసోడా సెంటర్ … కష్టమైన క్లైమాక్స్ తో ముడి పెట్టిన సీరియస్ మూవీ. దర్శకుడు కరుణకుమార్ పలాస 1978 తర్వాత మరో బోల్డ్ సినిమాతో ముందుకు వచ్చారు. సుధీర్ ఎంపిక చేసుకున్న చిత్రాల్లో ది బెస్ట్ మూవీ ఇది.

Sudheer Babu – A Villain for Mahesh Babu - tollywood

అలాగే న‌ట‌న ప‌రంగానూ సుధీర్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇక ఆనంది ఎంతో కరెక్ట్ గా సెట్ అయింది. అద్భుతమైన విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకున్నాయి` అంటూ మ‌హేష్ ట్వీట్ చేశాడు. మొత్తానికి మ‌హేష్‌ రివ్యూ చూస్తుంటే.. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చిన‌ట్టు స్ప‌ష్టంగా అర్థమైంది. కాగా, మ‌రికొంద‌రు సినీ ప్ర‌ముఖులు కూడా శ్రీదేవి సోడా సెంటర్ త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

`శ్రీదేవి సోడా సెంటర్`పై మ‌హేష్ రివ్యూ..ఇంత‌కీ ఏం చెప్పాడంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts