చిరు టైటిల్ రివిల్ చేసిన మ‌హేష్‌..`భోళా శంక‌ర్`గా మెగాస్టార్‌!

మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు చిరుకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. మ‌రోవైపు చిరంజీవి న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌ర‌స‌గా అప్డేట్స్‌ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి, మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమా నుండి కూడా అదిరిపోయే అప్డేట్ వ‌చ్చింది.

వేదాళం రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `భోళా శంక‌ర్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు టైటిల్ పోస్ట‌ర్‌ను టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రివిల్ చేస్తూ.. చిరుకు బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ మంచి విజయాలు సాధించాలని మ‌హేష్ ఆకాంక్షించారు.

ఇక మహేష్ బాబు విడుద‌ల చేసిన టైటిల్, టైటిల్ పోస్టర్ మెగా ఫ్యాన్స్‌కి సూప‌ర్‌ కిక్కిచ్చింది. కాగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్‌ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

Share post:

Popular