శర్వా-సిద్ధార్థ్‌ల `మహా సముద్రం` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!!

శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ లు క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `మ‌హా స‌ముద్రం`. అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Maha Samudram To Release In August! -

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్‌ 14న మహాసముద్రం చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలుపుతూ న్యూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉన్న ఈ పోస్ట‌ర్‌లో శ‌ర్వా, సిద్ధార్థ్ ఒక‌రికొక‌రు గ‌న్ పాయింట్ చేసుకుని సీరియ‌స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

Sharwanand, Siddharth's Maha Samudram to release in theatres on October 14.  New poster out - Movies News

ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది. కాగా, రెగ్యుల‌ర్ మాస్ ఎంట‌ర్‌టైన్ చిత్రాల‌కు భిన్నంగా ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకుంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ‌రో విష‌యం ఏంటంటే.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత సిద్ధ‌ర్థ్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

Share post:

Latest