ఓటీటీలో కీర్తి సురేష్ సంద‌డి..అస‌లు మ్యాట‌రేంటంటే?

August 19, 2021 at 1:01 pm

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులో స‌ర్కారు వారి పాట, గుడ్ లక్ సఖి చిత్రాల్లో న‌టిస్తోంది.

Saani Kaayidham First Look Poster: Keerthy Suresh, Selvaraghavan Steal the  Show in Rural Look

అయితే ఇప్పుడు కీర్తి ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తమిళంలో కీర్తి సురేష్ న‌టించిన‌ విభిన్నమైన సినిమా `సానికాయిధమ్`. మహేశ్వరన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ కీల‌క పాత్ర పోషించారు.

selvaraghavan on Twitter: "A new adventure begins! #SaaniKaayidham Happy  and excited to be a part of this amazing team! Here's our first look 🙏  @arunmatheswaran @KeerthyOfficial @Screensceneoffl @yaminiyag  @ramu_thangaraj @Inagseditor @CtcMediaboy ...

అయితే ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త రానుంది. కాగా, కీర్తి న‌టించిన పెంగ్విన్ చిత్రం ఆ మ‌ధ్య ఓటీటీలో రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. కానీ, ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది.

ఓటీటీలో కీర్తి సురేష్ సంద‌డి..అస‌లు మ్యాట‌రేంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts