శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా!

August 19, 2021 at 1:00 pm

కరుణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ తాజాగా విడుదల అయింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను విడుదల చేసి ఆ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే హీరో జైలు నుంచి బయటకు రావడం, హీరోయిన్ తో ప్రేమలో పడటం, అది వారి ఇంట్లో తెలియడం, ఆ తర్వాత ఊర్లో కొంతమంది ప్రమేయంతో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను విడగొట్టడం, కొంచెం ఎమోషనల్, ఆ తర్వాత మళ్ళీ హీరోని జైలుకు పంపడం, హీరోని జైలుకు పంపిన వారి ఆయన పగ తీర్చుకోవడం ఇలా ఈ ఈ విధంగా సినిమా కథ ఉండబోతుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను చూసి సినిమాలపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మహేష్ బాబు ప్రమోషన్లలో చేరడంతో ఈ సినిమాపై అయితే మరింతగా పెరిగింది. ఇప్పటికే రిలీజైన ఈ ట్రైలర్ కీ సంబంధించి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు సరసన తెలుగు అమ్మాయి ఆనంది హీరోయిన్ గా నటించింది. దర్శకుడు కరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా విజయ్ జిల్లా,శశి దేవి రెడ్డి ఈ మూవీని 70 ఎం ఎం ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు.

శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ విడుదల.. మాములుగా లేదుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts