ఎన్టీఆర్‌తో గొడ‌వ‌లు..గుట్టంతా బ‌య‌ట పెట్టేసిన‌ బండ్ల గ‌ణేష్‌..!

బండ్ల గ‌ణేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గ‌ణేష్‌.. నిర్మాత‌గానూ స‌త్తా చాటాడు. ఈయ‌న నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌గా.. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంప‌ర్‌` ఒక‌టి.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూజా జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన టెంప‌ర్ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్ల‌కు ల‌భాల‌ను తెచ్చిపెట్టింది. అయితే టెంప‌ర్ హిట్ త‌ర్వాత‌ రెమ్యునరేషన్ విషయంలోనే ఎన్టీఆర్, బండ్ల గణేష్ మధ్య గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని అప్ప‌ట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్త‌ల‌పై ఇరువైపుల నుంచి స్పంద‌న రాలేదు.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న బండ్ల గ‌ణేష్.. అస‌లు గుట్టంతా బ‌య‌ట పెట్టేశాడు. ఆయ‌న మాట్లాడుతూ..`అన్నదమ్ముల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వస్తూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. మిస్‌ కమ్యునికేషన్‌ వల్ల అలా జరిగింది. దాన్ని గొడవ అనలేం. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు` అని క్లారిటీ ఇచ్చాడు.