ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై చిరు కన్ను.. ఆ సినిమాను రిలీజ్ కానివ్వరా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడబోతుంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య అలాగే చిరంజీవి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోల ఆట ప్రస్తుతం రసవత్తరంగా మారబోతోంది. గతంలో ఖైదీ నెంబర్ 150, అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఒకేసారి విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించాయి.  బాలయ్య చిత్రం బాగానే ఆడగా, చిరు మరోసారి తన స్టామినా నిరూపించుకున్నారు. ఇప్పుడు మరొకసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్రను నటించబోతున్నారు.

ఇదిలా ఉంటే వీరిద్దరి సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అది కూడా దసరా పండుగకు థియేటర్ లలో సందడి చేయబోతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న చర్చ ఇదే. అయితే ఇదే దసరాకి త్రిబుల్ ఆర్ సినిమా ను రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయినప్పటికీ, మరొకసారి విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. జక్కన్న టీమ్‌. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌కి ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్.