కొమ‌రం భీమ్ ముస్లిం టోపీ ఎందుకు ధ‌రించాడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామార‌జుగా క‌నిపించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. గ‌తంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనీట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ టీజ‌ర్ చివ‌ర్లో భీమ్‌గా న‌టిస్తున్న ఎన్టీఆర్ ముస్లిం టోపీ ధ‌రించ‌గా.. ఆ విష‌యంతో తీవ్ర దుమారం రేగింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమ‌రం భీమ్‌కు ముస్లిం టోపీ పెట్ట‌డం ప‌ట్ల‌.. జ‌క్క‌న్న‌పై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ రైట‌ర్, రాజమౌళి తండ్రి కె.వి. విజయేంద్రప్రసాద్ భీమ్ ముస్లిం టోపీ ఎందుకు ధ‌రించాడో క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ.. భీమ్‌ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు ప్రయత్నించారు. వెంటాడారు. నైజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ విధంగా చేశాడు. ముస్లిం యువకుడిగా మారాడు అని చెప్పుకొచ్చారు. కాగా, పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం కోసం దేశ ప్ర‌జ‌లంద‌రూ ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.