మాఫియా డాన్‏గా ప్ర‌భాస్‌..నెట్టింట వీడియో వైర‌ల్‌!

July 22, 2021 at 8:24 am

మాఫియా డాన్ ఏంటీ? ప్ర‌భాస్ మ‌రేదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? అన్న సందేహాలు మీకే వ‌చ్చే ఉంటాయి. కానీ, అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తాజాగా ప్ర‌భాస్ ఎయిర్ పోర్ట్‏లో ప్రత్యక్షమయ్యాడు. అయితే తన బాడీగార్డ్స్ మధ్యలో నడిచోస్తున్న ప్రభాస్.. అచ్చం మాఫియా డాన్‏ మాదిరిగానే క‌నిపించాడు.

Prabhas Visuals @ Hyd Airport | Back From Radhe Shyam Shoot | MS  entertainments - YouTube

లూజ్ బ్లాక్ షర్ట్, పెన్సిల్ కట్ ఫ్యాంట్ ధ‌రించిన ప్ర‌భాస్‌.. ముఖానికి మాస్క్‌, జుట్టుకు బీని పెట్టుకుని ఎంతో ఇంట్రెస్టింగ్ గా క‌నిపించాడు. ఇంకేముంది, ఎయిర్ పోర్ట్‌లో జ‌నాలు త‌మ ఫోన్ల‌లో ప్ర‌భాస్‌ను ఫొటోలు, వీడియోల రూపంలో బంధించి.. సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

Prabhas - Wikipedia

ఈ క్ర‌మంలోనే బాడీగార్డ్స్ మధ్యలో నడిచోస్తున్న ప్రభాస్ వీడియో ఒకటి నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. ప్ర‌భాస్‌ను డాన్‌తో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్ర‌భాస్ ప్రస్తుతం రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ మూడూ సెట్స్‌పైనే ఉన్నారు. ఇక వీటి త‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో ఓ మూవీ చేయ‌నున్నాడు ప్ర‌భాస్‌.

మాఫియా డాన్‏గా ప్ర‌భాస్‌..నెట్టింట వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts