బాలీవుడ్ భామ‌తో గోవా బీచ్‌లో చిల్ అవుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి త‌ర్వాత ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన ఈ హీరోకు సామాన్యులే కాదు సెల‌బ్రెటీలు కూడా ఫ్యాన్స్ గా మారిపోయారు. ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ విజ‌య్‌కు విప‌రీతంగా పెరిగి పోయింది.

ఇదిలా ఉంటే.. సమయం చిక్కిన‌ప్పుడ‌ల్లా పార్టీలు, పబ్స్ అంటూ ఎంజాయ్ చేసే విజ‌య్ దేవ‌ర‌కొండ.. తాజాగా బాలీవుడ్ బిజీ భామ కియారా అద్వానీతో క‌లిసి గోవా బీచ్‌లో చిల్ అయ్యాడు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ పిక్‌లో ఇటు కియారా, అటు విజ‌య్ ఇద్ద‌రూ సూప‌ర్ హాట్‌గా క‌నిపిస్తుండ‌డంతో.. నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. మ‌రి విజ‌య్, కియారా గోవాకు క‌లిపి వెళ్లారా? లేక అనుకోకుండా గోవాలో క‌లిశారా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

Vijay Deverakonda- Kiara Advani

Share post:

Latest