ఏంటీ..`పుష్ప‌` స్పెష‌ల్ సాంగ్‌కు స‌న్నీ అంత అడిగిందా?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలోనే ఆ స్పెష‌ల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ స్టార్‌, ప్ర‌స్తుత బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్‌ను తీసుకున్న‌ట్టు జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ సాంగ్ కోసం స‌న్నీ పుచ్చుకుంటున్న రెమ్యునరేష‌న్ హాట్ టాపిక్‌గా మారింది.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఆ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డానికి స‌న్నీ డెబ్బై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేసింద‌ట‌. ఇక స‌న్నీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాత‌లు ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పిన‌ట్టు టాక్‌. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Share post:

Latest