ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?

ఒక‌ప్పుడు ద‌ర్శ‌కులు, ర‌చ‌యితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్ర‌స్తుతం ర‌చ‌యిత‌లంగా ద‌ర్శ‌కులుగా మారారు. దాంతో సెట్‌లో ర‌చ‌యిత‌ల అవ‌స‌రం త‌గ్గిపోయింది. ఒక‌వేళ ద‌ర్శ‌కుడు వేరే ర‌చ‌యిత‌తో ప‌ని చేయించుకున్నా సెట్‌లో మాత్రం అత‌ని పాత్ర అంతంత మాత్ర‌మే. ద‌ర్శ‌కుడిని మించిన ర‌చ‌యిత కొన్ని సంద‌ర్భాల‌లో క‌నిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సంద‌ర్భ‌మే- ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా షూటింగ్‌లో క‌నిపిస్తోంది.

- Advertisement -

ప‌వ‌న్ క‌ల్యాణ్ – రానా న‌టిస్తున్న `అప్ప‌య్య‌యున్ కోషియ‌మ్‌` సినిమాను రీమేక్ చేస్తున్న విష‌యం మ‌నంద‌రికి తెలుసు. ఈ సినిమాకు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా త్రివిక్ర‌మ్ ర‌చ‌యిత‌. త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లేతో పాటు క‌థ‌లో మార్పులు కూడా చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న కూడా సెట్లోనే ఉంటున్నారు. ఇటీవ‌ల మేకింగ్ వీడియోను విడుదల చేశారు. సాగ‌ర్ చంద్ర కంటే త్రివిక్ర‌మే ఎక్కువ‌గా క‌నిపించాడు ఆ వీడియోలో. సాగ‌ర్ చంద్ర కంటే.. త్రివిక్ర‌మ్ పెద్ద డైరెక్ట‌ర్‌. సాగ‌ర్ చంద్రకు ఈ సినిమా ఆఫ‌ర్‌ను క‌ల్పించంది త్రివిక్ర‌మే. `నేనున్న‌ప్పుడు నాతో పాటుగా త్రివిక్ర‌మ్ కూడా సెట్స్‌లో ఉండాలి` అని ప‌వ‌న్ చెప్పాడ‌టా… అలాంట‌ప్పుడు త్రివిక్ర‌మ్ ప‌వ‌ర్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. దాంతో సాగ‌ర్ చంద్ర పాత్ర కేవ‌లం నామ‌మాత్రం లాగా క‌నిపిస్తోంది. దాంతో త్రివిక్ర‌మ్ ఒక లాగా, సాగ‌ర్ చంద్ర మ‌రో లాగా ఆలోచ‌న చేసి సినిమా తీస్తే మాత్రం ప‌వ‌న్ మున‌గ‌డం ఖాయం.

Share post:

Popular