ఏపీలో మ‌ళ్లీ నైట్ క‌ర్ఫ్యూ .. నిబందనలు ఇవే..!

దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్‌ను ఎత్తేశారు. దాంతో ప్రజలు విచ్చ‌ల‌విడిగా తిరుగుతున్నారు. దేశంలో మళ్లీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు 20 నుండి 30 వేల వరకు కేసు నమోదవ్వ‌గా … ప్ర‌స్తుతం 40 వేలకు పైగా కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా ఆసుపత్రుల్లో క‌రోనా పేషంట్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దాంతో థర్డ్ వేవ్ సంకేతాలే చెబుతున్నారు నిపుణులు.

దాంతో ఏపీ సర్కార్ ముందు జాగ్ర‌త్త‌గా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను పొడ‌గించింది. ఆగస్టు 14 వరకు నైట్ కర్ఫ్యూను పొడ‌గించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను క‌ఠినంగా అమలు చేయాలని తెలిపింది. అంతేకాకుండా కర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను ఖ‌చ్ఛితంగా పాటించాల‌ని కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. థ‌ర్డ్ వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.