అఖిల్ `ఏజెంట్‌`లో కీరోల్‌కు నో చేసిన నాగ్‌..కార‌ణం అదేన‌ట‌?!

అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్క‌టీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన‌. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో చేస్తున్నారు.

Pooja Hegde, Akhil Akkineni's Most Eligible Bachelor to release on Pongal  2021; first poster unveiled-Entertainment News , Firstpost

ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ప్ర‌చారం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌ట ఆ పాత్ర కోసం కింగ్ నాగార్జున‌ను సంప్ర‌దించార‌ట మేక‌ర్స్‌.

Akhil Akkineni as "AGENT" First Look | Surender Reddy | Release 24th DEC  2021 - YouTube

కానీ, నాగ్ కావాల‌నే ఆ రోల్ చేయ‌న‌ని సున్నితంగా చెప్పార‌ట‌. అఖిల్ సినిమాలో నాగ్ నటిస్తే ప్రేక్షకుల ఫోకస్ అంతా ఆయ‌న‌పైనే ప‌డుతుంది. అందువ‌ల్ల‌నే నాగ్ ఈ ఆఫ‌ర్‌కు నో చెప్పార‌ట‌. దాంతో మేక‌ర్స్ మ‌మ్ముట్టిని మీట్ అయ్యి.. ఆయ‌న‌నే ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నారు. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.