విరుష్క జోడీపై ఫ్యాన్స్ అస‌హ‌నం..ఇలా చేశారేంటంటూ కామెంట్స్!

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిను అనుష్క శ‌ర్మ దంప‌తుల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అభిమానులు విరుష్క అని ముద్దుగా పిలుచుకునే ఈ జంట‌కు ఇటీవ‌లె పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఈమెకు వామికా అని నామ‌క‌ణం కూడా చేశారు.

కానీ, వామికా ముఖాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అభిమానుల‌కు చూపించ‌లేదు విరుష్క జోడీ. అయితే తాజాగా వామికా ఆరు నెల‌లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అనుష్క.. `తన ఒక్క చిరునవ్వుతో మా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మారిపోతుంది. చిన్నారి పాపా నువ్వు మా జీవితాల్లో నింపిన ప్రేమ ఇలాగే కలకాలం ఉండిపోవాలి` అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

Image

అయితే ఈ ఫొటోల్లో కూడా వామికా ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది అనుష్క‌. దాంతో విరుష్క జోడీపై అభిమానులు తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు నెటిజ‌న్లు.. ఇదేం బాగాలేదు.. ఇప్పటికైనా వామికాను మాకు చూపిస్తారనుకుంటే ఇలా చేశారేంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మ‌రి విరుష్క జోడీ అభిమానుల‌కు వామికా ద‌ర్శ‌నం ఎప్పుడు అవుతుందో చూడాలి.

https://www.instagram.com/p/CRMebJkJptY/?utm_source=ig_web_copy_link

Share post:

Popular