విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వెంకీ, వరుణ్‌లు కూడా రంగంలోకి దిగారు.
అవును, చాలా రోజుల తర్వాత ఎఫ్ 3 సినిమా నేడు సెట్స్ మీదకు వెళ్లింది. ఈ షెడ్యూల్‌లో ముఖ్య పాత్రధారులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.