రౌడీ హీరోపై క‌న్నేసిన‌ `ఉప్పెన‌` డైరెక్ట‌ర్‌..గుడ్‌న్యూస్ చెబుతాడా?

సుకుమార్ ప్రియ‌శిష్యుడు బుచ్చిబాబు సాన‌ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో,హీరోయిన్‌గా ఉప్పెన చిత్రాన్ని తెర‌కెక్కించిన బుచ్చిబాబు.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు. దాంతో ఈయ‌న పేరు ఇండ‌స్ట్రీలో మారుమోగిపోయింది.

ఈ నేప‌థ్యంలోనే బుచ్చిబాబు నెక్స్ట్ ఏ హీరోతో చేయ‌బోతున్నాడు అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ, ఎవ‌రితోనూ ఫైన‌ల్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై బుచ్చిబాబు క‌న్నేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. బుచ్చిబాబు త‌న త‌దుప‌రి చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ చేయాల‌ని భావిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి నిజంగానే విజ‌య్‌తో సినిమా ప్ర‌క‌టించి.. ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెబుతాడా? లేదా? అన్న‌ది త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.