టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బన్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు.
బన్నీ స్వయంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సందడి చేశాడు. ఈ క్రమంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సందర్శించారు. ఆ సమయంలో తీసిన ఓ వీడియోను స్నేహ రెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, బన్నీ సినిమాల విషయానికి.. ప్రస్తుతం ఈయన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.
https://youtu.be/lP0guHmYQTw