కొర‌టాల బ‌ర్త్‌డే..`ఆచ‌ర్య‌` నుంచి రానున్న అదిరిపోయే అప్డేట్‌?

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి

ఇక ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రేపు కొర‌టాల శివ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆచ‌ర్య చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ రానుంద‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రాబోతోంద‌ని తెలుస్తోంది.

కాగా, ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు సింగిల్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దాంతో అప్పటి నుంచి ఆభిమానులంతా సెకండ్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తితో, ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అయితే కొర‌టాల బ‌ర్త్‌డే రోజున సెకెండ్ సింగిల్ విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేసిన‌ట్టు ఓ టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

Share post:

Latest