పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన ప్ర‌భాస్ హీరోయిన్‌..ఫొటోలు వైర‌ల్!

June 5, 2021 at 11:04 am

రిచా గంగోపాధ్యాయ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లీడర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కిన మిర్చి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. అయితే కెరీర్ పీక్స్‌కు వెళ్తున్న స‌మ‌యంలో హైయర్ స్టడీస్ కోసం సినిమాల‌ను వ‌దిలేసి అమెరికా వెళ్లిపోయింది ఈ భామ‌.

ఇక అక్క‌డే త‌న చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ.. ఫిబ్ర‌వరిలో తాను త‌ల్లి కాబోతున్న‌ట్టు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా రిచా పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

మే 27న త‌మ‌కు చిన్నారి జ‌న్మించార‌ని, ఈ విష‌యాన్ని కాస్త ఆల‌స్యంగా తెలియ‌జేస్తున్నామ‌ని తెలుపుతూ కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

పండంటి బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చిన ప్ర‌భాస్ హీరోయిన్‌..ఫొటోలు వైర‌ల్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts