థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీలో రిలీజ్ కానున్న ప్రభాస్ సినిమా.?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రంగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ అటు మూవీ థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా రిలీజ్ కాబోతుందని వార్తలు చక్కర్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త ఇప్పడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే నటించిన రాధే చిత్రం కూడా ఈద్ పండుగ సందర్బంగా మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించారు.

కానీ ఆ చిత్రాన్ని మేకర్స్ ఓటీటీలో పే-ఫర్ వ్యూ పద్ధతిలో విడుదల చేయనున్నారట. అదే పద్దతిలో రాధేశ్యామ్ చిత్రం కూడా రిలీజ్ చేస్తారని వినిపిస్తుంది. కానీ ఈ వార్తల్ని మూవీ యూనిట్ ఖండిస్తోంది. అసలు రాధేశ్యామ్ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు మేకర్స్ కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా వాయిదా పడుతుందని అంటున్నారు దర్శకుడు. మరి ఈ రూమర్స్ పై సినీ నిర్మాతలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సిందే.

Share post:

Latest