గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..ఆనందంలో ఫ్యాన్స్‌!

May 5, 2021 at 5:54 pm

ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ప్ర‌స్తుతం హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ బ్యూటీ తెలుగులో రాధేశ్యామ్, ఆచార్య‌, మోస్ట్ ఎలిజబెత్ బ్యాచ్‌లర్ చిత్రాలు చేస్తోంది. అలాగే త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ 65వ సినిమాలోనూ, హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న స‌ర్క‌స్‌లోనూ పూజా న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల పూజా హెగ్డే క‌రోనా బారిన సంగ‌తి తెలిసిందే. అయితే హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్న ఆమె.. తాజాగా క‌రోనా నుంచి కోలుకున్నాన‌ని గుడ్‌న్యూస్ చెప్పింది. కరోనా నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని, కరోనాను తన్నితరిమేశానని ట్విట్ట‌ర్ వేదిక‌గా పూజా పేర్కొంది.

తాజాగా చేయించుకున్న పరీక్షల్లో నెగటివ్ రిపోర్టులు వచ్చినట్టు తెలిపింది. మీ అందరి ఆదరాభిమానాలు, విషెస్‌‌తో తాను త్వరగా రిక‌వ‌ర్ అయ్యాన‌ని వివరించింది. ఇక పూజా క‌రోనా బారి నుంచి బ‌య‌ట ప‌డ‌డంతో.. ఆమె అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..ఆనందంలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts