వ్యాక్సిన్ ఇవ్వ‌లేద‌ని ఏఎన్ఎంపై దాడి..!

May 5, 2021 at 7:57 pm

కొవిడ్ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డుతున్న‌ది. ఆక్సిజ‌న్ అంద‌క వంద‌లా మంది ప్రాణాల‌ను కోల్పోతున్నారు. మ‌రోవైపు క‌రోనా బాధితుల‌కు ఏడాది వైద్యాధికారులు అవిశ్రాంతంగా సేవ‌ల‌ను అందిస్తున్నారు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి చికిత్స చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మూర్ఖులు వైద్య‌సిబ్బందిపై దాడుల‌కు దిగుతున్నారు. ఇటీవ‌ల మాస్క్‌ల‌ను పెట్టుకోవాల‌ని సూచించిన ఓ న‌ర్స్‌పై, శానిటేష‌న్ సిబ్బందిపై ఇద్ద‌రు యువ‌కులు దాడుల‌కు దిగారు. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రొక వెలుగుచూసింది.

ఖైరతాబాద్ వెల్ నెస్ సెంటర్ లో ఏఎన్ఎం మంజుల, ఆశా వర్కర్ మల్లీశ్వరి లపై స్థానిక ప్రాంతానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి దాడికి దిగాడు. వ్యాక్సిన్ కోసం వెల్ నెస్ సెంటర్ కి వచ్చిన స‌ద‌రు వ్య‌క్తి త‌న‌కు స్లాట్ బుకింగ్ లో టెక్నీకల్ ప్రాబ్లమ్ వస్తుందని… తనకు వ్యాక్సిన్ కచ్చితంగా ఇవ్వాలని ఏఎన్ ఎంతో వాగ్వివాదానికి దిగాడు. అయితే వ్యాక్సిన్ నిల్వ లేద‌ని ఏఎన్ ఎం చెప్పడంతో ఆగ్రహంతో రాజేశ్ ఆమెపై దాడికి దిగారు. దీంతో బాధితురాలు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయ‌గా కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు అధికారు. రాజేష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వ్యాక్సిన్ ఇవ్వ‌లేద‌ని ఏఎన్ఎంపై దాడి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts