పూరీని వేడుకుంటున్న రౌడీ ఫ్యాన్స్ ..?

May 5, 2021 at 4:06 pm

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ చిత్రం నుండి అప్ డేట్స్ కోసం అభిమానులంతా ఎప్పటినుండో వేయిట్ చేస్తున్నారు. దీనితో కనీసం తమ రౌడీ హీరో విజయ్ లుక్ నైనా రివీల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారట విజయ్ ఫాన్స్. పూరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చార్మీ, కరణ్ జొహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

దీనిలో బాలీవుడ్ అందాల భామ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తుంది. రమ్యకృష్ణ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తుంది. ఇక అనన్య ఈ మూవీతోనే టాలీవుడ్ కు అడుగు పెడుతుంది. కరోనా కారణంగా చాలా కాలంగా మూవీ నిర్మాణ పనులు అన్ని ఆగిపోయాయి.దీనితో విజయ్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా లైగర్ మూవీ అప్ డేట్స్ కావాలని కోరారు. కనీసం విజయ్ లుక్ అయినా రెవీల్ చేయాలంటూ పూరీని డిమాండ్ చేస్తున్నారట.

పూరీని వేడుకుంటున్న రౌడీ ఫ్యాన్స్ ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts