పెళ్లిపై న‌య‌న్ కీల‌క నిర్ణ‌యం..అసహ‌నంలో విఘ్నేష్ ఫ్యామిలీ?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మ‌యం దొరికిందంటే చాలు విహార యాత్ర‌ల‌కు చెక్కేసే ఈ ప్రేమ ప‌క్షులు.. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అప్పుడ‌ని, ఇప్పుడ‌ని వీరి పెళ్లిపై అనేక సార్లు వార్త‌లు వ‌చ్చినా అవి రూమ‌ర్లుగానే మిగిలిపోయాయి. ఇక గ‌త కొద్ది రోజులుగా 2021లోనే వీరిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. పెళ్లి విష‌యంలో న‌య‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌.

2021లో కాకుండా వ‌చ్చే ఏడాది పెళ్లి చేసుకోవాల‌ని ఈ అమ్మ‌డు నిశ్చ‌యించుకుంద‌ట‌. ఇదే విష‌యాన్ని విఘ్నేష్‌కు చెప్ప‌గా.. ఆయ‌న కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. కానీ, న‌య‌న్ నిర్ణ‌యంపై విఘ్నేష్ కుటుంబ స‌భ్యులు మాత్రం అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని టాక్ న‌డుస్తోంది.