ద‌ర్శ‌కుల‌ను ఇర‌కాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్‌!?

May 14, 2021 at 9:59 am

రీల్ లైఫ్‌లో విల‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్‌.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం సూప‌ర్ హీరో అనిపించుకున్నాడు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లో ఎంద‌రో వలస కార్మికులకు అండ‌గా నిలిచిన సోనూ.. సెకెండ్ వేవ్‌లో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ క‌రోనా బాధితుల‌ను ఆదుకుంటున్నారు.

హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం..ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తూ దేశ ప్ర‌జ‌ల పాలిట దేవుడయ్యాడు. ఈ క్ర‌మంలోనే సోనూ ఇమేజ్ తారా స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పుడు ఆ ఇమేజే ద‌ర్శ‌కుల‌ను ఇర‌కాటంలో పెడుతుంద‌ట‌.

మ్యాట‌ర్ ఏంటంటే.. ఇన్నాళ్లు నెగెటివ్ రోల్స్‌ చేసిన సోనూసూద్‌ను ఇప్పుడు విలన్‌గా చూపించేందుకు ద‌ర్శ‌కుడు భయపడుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో ఈయ‌నో హీరో. అందుకే ఈయనను తెరపై ప్రతినాయకుడిగా చూపించాలి అంటే అంత సులభం కాదు. ఒక‌వేళ సినిమాలో కథాపరంగా సోనూను హీరోలు కొట్టినా కూడా అభిమానులు తట్టుకునే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలోనే ఏం చేయాలో తెలియ‌క ద‌ర్శ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌.

ద‌ర్శ‌కుల‌ను ఇర‌కాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్‌!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts