క‌రోనా బాధితులకు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ అప‌న్న‌హ‌స్తం!

May 14, 2021 at 10:17 am

సెకెండ్ వేవ్‌లో క‌రోనా ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి కాటుకు ప్ర‌తి రోజు వేల మంది బ‌లైపోతుండ‌గా.. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక ఈ సెకెండ్ వేవ్‌లో హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్స్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉంది.

ఇలాంటి త‌రుణంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా ప్ర‌ముఖు త‌మిళ ద‌ర్శ‌కుడు మురుగుదాస్ కూడా క‌రోనా బాధితులకు అప‌న్న‌హ‌స్తం అందించారు.

క‌రోనా రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి స్టాలిన్‌కు రూ. 25 ల‌క్ష‌ల చెక్ అందించారు. కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు చిన్న సాయం అందించాన‌ని.. ప్ర‌తి ఒక్క‌రు త‌మ‌కు తోచినంత సాయం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా ముర‌గుదాస్ పేర్కొన్నారు.

AR Murugadoss donates Rs 25 lakh to Tamil Nadu Chief Minister's Relief Fund  - Movies News

క‌రోనా బాధితులకు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ అప‌న్న‌హ‌స్తం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts