మ‌ళ్లీ విడుద‌ల‌కు సిద్ధమ‌వుతున్న నాని `వి`!

న్యాచుర‌ల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెర‌కెక్కించిన చిత్రం `వి`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

- Advertisement -

అయితే ఇప్పుడు ఇదే సినిమా మళ్లీ విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. అది కూడా అమోజాన్ ప్రైమ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తెలుగులో హిట్టైన చిత్రాల‌ను బాలీవుడ్‌లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే నాని న‌టించిన పిల్ల జ‌మిందార్‌, నిన్నుకోరి, కృష్ణార్జున యుద్దం, జెంటిల్ మాన్ వంటి పలు సినిమాలు హిందీలో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌గా.. మంచి టాక్ తెచ్చుకున్నాయి.‌

ఈక్రమంలో నాని నటించిన ‘వి’ సినిమాని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 4న హిందీలో వి చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అమోజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది. ఇక ఈ చిత్రంతో పాటు సూర్య‌ నటించిన `ఆకాశం నీ హద్దురా` సినిమాను కూడా హిందీ వ‌ర్ష‌న్‌లో అదే రోజు విడుద‌ల చేయ‌నున్నారు.

Share post:

Popular